సైనస్ సమస్యకు చెక్ పెట్టే ఆ ఐదు చిట్కాలు ఇవే..!

manaarogyam

సైనస్ సమస్య తో చాలా మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.శీతాకాలంలో సమస్య ఇంకా ఎక్కువగా ఉండడం సహజం. అయితే యాంటీబయాటిక్స్ వాడకుండానే ఒక్కోసారి తగ్గిపోతుంది.ఈ సైనస్ లక్షణాల విషయానికొస్తే..బుగ్గలు, నుదిటి వెనుక, ముక్కుకు ఇరువైపులా వచ్చే వాపు. ఇది గొంతు నుంచి పొట్ట వరకు పోయే ప్రవాహాన్ని ఆపుతుంది. వైరస్, బ్యాక్టీరియా వల్ల కూడా ఇది వ్యాపించవచ్చు. గాలి ద్వారా ఎక్కువగా ఈ సమస్య తలెత్తుతుంది.

ఈ సైనస్ ను ఇంటి చిట్కాలతో తగ్గించ వచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎలానో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ఆవిరి పట్టడం:

ఆవిరి పట్టడం ద్వారా నాసికా భాగాలు తెరచుకుంటాయి. నొప్పి, ఒత్తిడిని తగ్గించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. పసుపు, తులసి, యూకలిప్టస్, మరికొన్ని మూలికలను వేసి పడితే ఉపశమనం కలుగుతుంది. అలాగని అదే పనిగా పడితే ఊపిరితిత్తులకు ప్రమాదం.

వెచ్చని వస్త్రం తో మర్దన:

ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.ముక్కు, బుగ్గలు, కళ్లపై ఆవిరి పట్టిన టవల్ లేదా క్లాత్‌తో మర్దన చేయోచ్చు. అప్పుడు సైనస్ నుంచి విముక్తి కలుగుతుంది.

మంచి నీళ్ళు:

ఈ సమస్య ఉన్న వాళ్ళు నీళ్ళను ఎక్కువగా తాగడం వల్ల శ్లేష్మం తొలగిపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు. కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు నీరు తాగుతూ సైనస్ నుంచి బయట పడవచ్చు..

హ్యూమిడిప్లైయర్ వాడకం:

హ్యూమిడిప్లైయర్ గాలిలో తేమను పెంచుతుంది. మంటను తగ్గించడానికి, ముక్కు రంధ్రాలు తెరుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. హ్యూమిడిప్లైయర్ సమర్థంగా పనిచేయాలంటే వీలైనంత దగ్గర పెట్టుకుని వాడాలి..దీన్ని వాడే ముందు తయారీదారుల సలహాలను పాటించాలి..

నెట్ పాట్:

ముక్కు రంధ్రాలు శుభ్రం చేసుకోవడానికి చక్కగా ఉపయోగ పడుతుంది.దీర్ఘకాల సైనస్ సమస్య ఉన్నవారు ఆరు నెలల పాటు ఈ విధానాన్ని అనుసరిస్తె మంచిదని నిపుణులు అంటున్నారు. ఈ ఐదు చిట్కాలతో సైనస్ నుంచి ఉపశమనం పొందవచ్చు..

Leave a Comment