స్కిన్ టోన్ పెరగాలంటే ఈ ప్యాక్ తప్పనిసరి..

manaarogyam

అందంగా కనిపించాలని చాలా మంది అనుకుంటారు. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఫలితం లేక విసిగిచెంది మౌనంగా ఉంటారు.. అలాంటి వారు ఈ ప్యాక్ ను వేసుకోవడం మంచిది. ఎటువంటి పదార్థాలు కావాలి..ఎలా వేసుకోవాలి. అనేది ఇప్పుడు చూద్దాం..


ఈ ప్యాక్ కోసం ముందుగా ఒక యాపిల్ పండు తీసుకుని వాటర్‌లో వేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత యాపిల్ పై తొక్కను తొలగించి లోపలి భాగాన్ని మాత్రం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.


ఇప్పుడు యాపిల్ పేస్ట్‌లో ఒక స్సూన్ బార్లీ పౌడర్‌, రెండు స్పూన్ల తేనె. అర స్పూన్ నిమ్మ రసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, కావాలీ అనుకుంటే మెడకు కూడా అప్లై చేసుకుని.. పది హేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆర బెట్టు కోవాలి. అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని మరియు మెడను క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను రెండు రోజులకు ఒక సారి వేసుకుంటే.. మీ స్కిన్ టోన్ క్రమ క్రమంగా పెరుగు తుంది. పైగా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంపై ఏర్పడిన ఎటు వంటి మచ్చలైన క్రమంగా మటు మాయం అవుతాయి..వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Leave a Comment