మినప పిండితో మిలమిల మెరిసే చర్మం మీ సొంతం..

manaarogyam

ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి మనం ఎన్నెన్నో చెస్తాము.. అయితే ఎప్పుడూ మినప పిండిని మాత్రం ట్రై చేయలేదు. కానీ ఈ పిండి వల్ల చర్మం మరింత కాంతివంతంగా మారుతుందని నిపుణులు అంటున్నారు..ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

మినుములు తీసుకుని లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న మినుములను మెత్తగా పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల మినప పిండి, అర స్పూన్ చందనం పొడి, మూడు స్పూన్ల పెరుగు, అర స్పూన్ నిమ్మ రసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పావు గంట పాటు ఆరబెట్టుకోవాలి. అనంతరం కూల్ వాటర్‌లో ఫేష్ వాష్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మంపై పేరుకు పోయిన మురికి, మృత కణాలు, అధిక జిడ్డు తొలగి పోతాయి. ముఖం గ్లోగా, షైనీగా మారుతుంది.

అలాగే మినపపిండితో మరో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. అందు కోసం ఒక బౌల్ తీసుకుని రెండు స్పూన్ల మినపపిండి, ఒక స్పూన్ అరటి పండు పేస్ట్‌, నాలుగు స్పూన్ల పచ్చి పాలు, రెండు విటమిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.. ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి. ఆపై గోరు వెచ్చని నీటితో చర్మాన్ని శుభ్ర పరుచుకోవాలి. మూడు రోజులకు ఒక సారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం తెల్లగా, కాంతి వంతంగా మారుతుంది… చుసారుగా మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

Leave a Comment