అన్నీ సీజన్ లలో దొరికే పొట్లకాయ ను తినడానికి చాలా మంది ఇష్టపడతారు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ కాయలను పిలుస్తారు. అంతే వెరైటీగా వంటలను కూడా చేస్తారు.ఈ కాయలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మాత్రం అస్సలు వదలరు.. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు రోజూ పొట్లకాయలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. లేదా రోజూ పొట్లకాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులోతాగవచ్చు. వీటిలో ఉండే ఫైబర్ బరువును తగ్గిస్తుంది.ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది.జ్యూస్‌ను తాగడం వల్ల కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పొట్లకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.. ఇమ్మ్యునిటి ని పెంచుతుంది.క్యాన్సర్ వంటి దీర్ఘ కాలిక జబ్బులను నివారిస్తుంది.
పొట్లకాయల్లో విటమిన్లు ఎ, బి6, సి, ఇ లతోపాటు అనేక రకాల మినరల్స్ ఉంటాయి. ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, మాంగనీస్ మొదలగునవి ఎక్కువ మోతాదు లో ఉంటాయి. అందుకే ఈ కాయను సర్వ రోగ నివారిని అని పిలుస్తారు.. మీరు కూడా ట్రై చెయ్యండి.