సొరకాయ తో ఎప్పుడైనా ఇలా చేశారా?

manaarogyam

సొరకాయను ఎక్కువగా నార్త్ ఇండియా వాళ్ళు వంటల లో, స్వీట్స్ తయారి లో ఎక్కువగా ఉపయోగిస్తారు.మన సైడ్ కూరలు, గారెలు, హల్వా లను చేస్తారు. కానీ సొరకాయ తో దోస ఎప్పుడూ చేసి ఉండరు. చాలా రుచిగా, ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ దోస ను ఎలా చెసుకొవాలొ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కావాలిసిన పదార్థాలు:

బియ్యం – రెండు కప్పులు,
సొరకాయ ముక్కలు- ఓ కప్పు,
ఎండు మిర్చి- ఎనిమిది,
అల్లం- కొద్దిగ,
జీలకర్ర- రెండు స్పూన్లు,
ఇంగువ- చిటికెడు,
ఉప్పు, నీళ్లు,
నూనె- తగినంత.

తయారీ విధానం:

బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టాలి. ఓ మిక్సీలో ఇడ్లీ బియ్యం, సొరకాయ ముక్కలు, ఎండు మిర్చి, జీలకర్ర, ఇంగువ, అల్లం వేసి రుబ్బుకోవాలి. ఈ పిండిని రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం కు బాగా పులుస్తుంది అప్పుడు దోసెలు వేసుకుంటే బాగుంటాయి.. కొబ్బరి చట్ని తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.. మీరు కూడా ట్రై చెయ్యండి.

Leave a Comment