Spicy Chicken Fry : చికెన్‌ను కారంగా.. రుచిగా.. ఇలా ఫ్రై చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Spicy Chicken Fry : చికెన్ ను మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసిన వంట‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. చికెన్ తో రుచిగా, సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ప‌ప్పు, ర‌సం, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి చికెన్ ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ చికెన్ ప్రైను ర‌క‌ర‌కాల ప‌ద్ద‌తుల్లో త‌యారు చేస్తూ ఉంటారు. త‌ర‌చూ చేసే చికెన్ ఫ్రై కంటే మ‌రింత కారంగా, రుచిగా, సుల‌భంగా అంద‌రికి న‌చ్చేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్పైసీ చికెన్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, చికెన్ మ‌సాలా – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 10, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4.

మ‌సాలా దినుసులు..

సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 3, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్.

స్పైసీ చికెన్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో మ‌సాలా దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చికెన్ ను వేసి క‌ల‌పాలి. దీనిని పెద్ద మంట‌పై 10 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత ఉప్పు, ప‌సుపు, మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడి, చికెన్ మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై మ‌రో 15 నిమిషాల పాటు వేయించాలి.

త‌రువాత క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని సైడ్ డిష్ గా తిన‌వ‌చ్చు. అలాగే అన్నంతో కూడా క‌లిపి తిన‌వ‌చ్చు. ఈ ఫ్రై కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే చికెన్ ఫ్రైతో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా చికెన్ ఫ్రైను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.