స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. చూడగానే తినాలనిపించే రంగు, నోరూరించే పుల్లని రుచి వల్ల చాలా మంది తినడానికి ఆసక్తి చూపిస్తారు..విటమిన్ సి, యాంటి యాక్సిడెంట్స్, సాలిసిలిక్ యాసిడ్,మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.ఆరోగ్యానికి మాత్రమే కాదు.జుట్టు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి.
స్ట్రాబెరీలలో రోగనిరోధక శక్తి పెంపొందించే గుణాలు ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇమ్మ్యునిటి పెరుగుతుంది.యాంటీఆక్సిడెంట్లు బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. అందుకే మెదడు చురుగ్గా పనిచెస్తుంది..
విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల ఈ పండ్లు తినడం వల్ల కళ్ళకు మంచిది.స్ట్రాబెర్రీలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలానే యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉంటాయి. వీటి వల్ల క్యాన్సర్ సమస్య మాయం అవుతుంది. అంతేకాదు గుండె సమస్యలను తగ్గించడంలో అద్బుతమైన మెడిసిన్ ఈ పండ్లు.బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడానికి స్ట్రాబెర్రీలు బాగా ఉపయోగపడతాయి.. ఉదర సమస్యలను కూడా తగ్గిస్థాయి.. మన దేశంలో వీటిని తక్కువగా తింటారు. కానీ విదేశాల్లో మాత్రం ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకూ ఏదొక విధంగా తింటారు..