సున్నుండలను అందరూ తింటారు. వాటితో చాలా ఆరోగ్యం వుంటుంది అయితే వీటిని చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావాలసిన పదార్థాలు:
మినప్పప్పు – 1 కప్పు
బెల్లం – 1 కప్పు
పుట్నాలు – అర కప్పు
యాలకుల పొడి – చెంచా
నెయ్యి – అర కప్పు

తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మినప్పప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని పెట్టుకోవాలి. మినప్పప్పు చల్లారిన తర్వాత పుట్నాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరోవైపు బెల్లాన్ని కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత బెల్లం పొడి, మినప్పప్పు-పుట్నాల పొడి.. ఈ రెండింటినీ బాగా కలుపుకోవాలి. అరచేతులకు నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని ఉండలుగా కట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మినప సున్నుండలు తినడానికి సిద్ధం. చుసారుగా ఎంత సింపుల్ గా అయ్యిందో.. సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి.