ఎట్టేట్టా.. వంకాయలను తింటే బరువు తగ్గుతారా?

manaarogyam

అధిక బరువును తగ్గించడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనంలేదని మానుకుంటారు. ఆగండి.. మీకు కూరగాయలతో బరువు తగ్గ వచ్చు అనే విషయం తెలుసా? అవును మీరు విన్నది నిజమే.. కూరగాయల లో రాజు వంకాయ.. ఈ వంకాయ పేరు వినగానే నోరు ఊరుతుంది కదా.. ఎక్కడ వాళ్ళు అయిన వీటిని రుచి చేయాల్సిందే.. రక రకాల వంకాయలు మనకు మార్కెట్ లో దొరుకుతాయి..

అయితే వంకాయతో రుచికరమైన వంటలే కాదు.. అనేక అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. వంకాయలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వంకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది వ్యాధులు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.అలాగే రోగ నిరోధక శక్తిని పెంచేలా చేస్తుంది.ఈ కాయల తో చేసిన కూరలను వారం లో రెండు సార్లు తింటే ఎన్నో అనారొగ్య సమస్యలు దూరం అవుతాయి.బరువు తగ్గాలనుకునేవారు ఖచ్చితంగా వారంలో రెండు సార్లు వంకాయలను తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేవిధంగా, వంకాయలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి చాలా మంచిది.గుండె జబ్బులను,షుగర్ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది.. అందుకే వంకాయ పై అపొహాలు వదిలి తినండి..ఆరొగ్యాన్ని పెంచుకొండి.

Leave a Comment