కార్న్ సూప్ ను ఇలా ట్రై చెయ్యండి..

manaarogyam

మొక్క జొన్న అంటే చాలా మందికి ఇష్టం.. తియ్యగా ఉండటం మాత్రమె కాదు వాటి వాసన కూడా జనాలను విపరీతంగా ఆకర్షిస్తుంది. అందుకే వీటి తో వివిధ రకాల వంటలను చెసుకుంటారు. వీటితో మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో ఎక్కువగా వీటిని వాడతారు. చాలా ఈజిగా వుండేలా సూప్ చేసుకోవడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

మొక్కజొన్న గింజలు – ఒక కప్పు
నీళ్లు – రెండు కప్పులు
మిరియాల పొడి – పావు టీస్పూను
జీలకర్ర పొడి – ఒక టీ స్పూను
కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను
అల్లం తరుగు – ఒ టీస్పూను
నెయ్యి – ఒక టీస్పూను
ఉప్పు – రుచికి తగినంత

తయారి విధానం..
ముందుగా మొక్క జొన్నలను తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఓ మాదిరిగా మిక్సిలొ వేసి పేస్ట్ చేయాలి.రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నెను పెట్టి చిన్న మంట మీద నెయ్యి వేసి వేడిచేయాలి. వేడెక్కిన నెయ్యిలో జీలకర్ర వేయాలి. తరువాత అల్లం తరుగు, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి. మొక్కజొన్న ముద్ద మిశ్రమం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మిరియాల పొడి కూడా చల్లాలి. ఇప్పుడు చిన్న మంట మీద పావుగంట సేపు ఉడకనివ్వాలి.. మంచి కార్న్ వాసన వచ్చినపుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి గా సర్వ్ చేసుకొని తాగడం మంచిది..మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి.

Leave a Comment