ఇప్పడున్న ప్రతి ఒక్కరిలో బరువు సమస్య ఉంటోంది. నూనెకు సంబంధించిన ఆహారంతో పాటు అనేక కారణాలతో చాలా మంది స్థాయికి మించిన బరువు పెరుగుతున్నారు. దీంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల చికిత్సలు తీసుకుంటూ లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. మరికొందరు ఆహారం తీసుకోవడం మానేసి కఠిన వ్యాయామాలు చేస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్ కు గురయి మరికొన్ని కొత్త రోగాలను తెచ్చుకున్నవాళ్లమవుతాం. అయితే బరువు పెరుగుతున్నాం అనుకునేవాళ్లు ఎలాంటి ఖర్చు లేకుండో ఇంట్లోనే మంచి కాషాయాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా చేసిన దానిని క్రమపద్ధతిలో తీసుకోవాలి.
బరువు పెరిగిన వారిలో ఇతర ఆనారోగ్య సమస్యలు మొదలవుతాయి. బరువుతో పాటు గ్యాస్ ట్రబుల్ స్ట్రాట్ అయిన ఆ తరువాత గుండెపై ఎఫెక్ట్ పడుతుంది. అందువల్ల ముందుగా బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. బరువు తగ్గడం వల్ల మిగతా అనారోగ్యాలకు కూడా చెక్ పెట్టొచ్చు. అయితే బరువు తగ్గడానికి చాలా మంది లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కొందరు ఆపరేషన్లు సైతం చేయించుకుంటున్నారు. కానీ కొన్ని చిన్న టిప్స్ పాటించడం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా బరువు తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ చిన్న చిట్కాతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే..? ఒక గ్లాస్ నీటిని, జీలకర్రను, తీసుకోవాలి. ముందుగా ఒక గ్లాసులో నీటిని పోసి అందులో ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిలో అరచెక్క నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనెను కలిపి తాగాలి. ఈ నీటిని రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. అయితే ఈ చిట్కా పాటిస్తూనే రోజూ వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల అధిక బరువు నుంచి సాధారణ స్థితికి వస్తారు.
బరువు తగ్గేందుకు పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేదని , ఇలాంటి చిట్కా పాటిస్తే చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణశక్తిని పెంపొందించడానికి జీలకర్ర అద్భుత ఔషధం. అందువల్ల రోజూ ఇలా నీటిలోనే కాకుండా కూరల్లోనూ జీలకర్రను తప్పనిసరిగా వేయాలి. అలా రోజూ ఆహారంలో జీలకర్రను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఫలితంగా కొవ్వు పేరుకుపోకుండా బరువు పెరిగే అవకాశం లేకుండా పోతుంది.