Taping Toes : కాలి చూపుడు వ్రేలుకు, మధ్యవేలుకు టేపు వేస్తారు.. ఎందుకంటే..?

manaarogyam

మనం రోజూ చేసే పనుల ద్వారా శరీరం అలసిపోతుంది. కొందరిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల కాస్త ఎనర్జీగా ఉంటారు. కానీ కొందరు ఇది తక్కువగా ఉండడం వల్ల త్వరగా అలసిపోతారు. దీంతో బాడీ పేయిన్స్ వస్తుంటాయి. ఇలా శరీరంలో అవయవాల నొప్పి ఏర్పడినప్పుడు పెయిన్ కిల్లర్ లాంటి మాత్రలు వేసుకొని తాత్కాలికంగా ఉపశమనం పొందుతారు. అందరిలో ఈ పెయిన్ కిల్లర్ మంచివి కాదని వైద్యులే సూచిస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం వల్ల ఇలాంటి నొప్పుల నుంచి బయటపడొచ్చు.

ఎక్కువ సేపు నిల్చోవడం.. అతిగా నడిచే వారిలో కాళ్ల నొప్పులు వేధిస్తుంటాయి. ముఖ్యంగా కొందరి కాళ్ల వేళ్లభాగంలో నొప్పి తీవ్రంగా ఉండి వేధిస్తుంటుంది. వీటిని తగ్గించేందుకు చిన్న చిట్కా పాటిస్తే చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు కాళ్ల వేళ్లకు రిజిడ్ స్పోర్ట్స్ టేప్ వేసి పడుకుంటే తెల్లరిసరికల్లా ఈ నొప్పి మాయం అవుతుందని అంటున్నారు. ఇలా నొప్పి ఉన్నప్పుడు చిట్కా పాటిస్తే ఉపశమనం పొందుతారు. అయితే కాళ్లలోని ఏ వేళ్లకు ఈ టేపు వేయాలి..? అనేది తెలుసుకుందాం.

రోజంతా కాళ్లతో ఏదో పని చేస్తుంటాం. రాత్రి సమయంలో పడుకున్నప్పుడే వీటికి విశ్రాంతి దొరుకుతుంది. అందువల్ల ఈ సమయంలో కాళ్లకు టేపు వేసుకోవాలి. కాళ్ల నొప్పులు విపరీతంగా ఉన్న సమయంలో కాలి చూపుడు వ్రేలు, మధ్య వేలుకు రిజిడ్ స్పోర్ట్స్ టేపు వేయాలి. అలా రాత్రంతా ఉంచి ఉదయాన్నే తీసేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఒత్తిడి ఎక్కువగా పడకుండా ఉంటుంది. అంతేకాకుండా నడిచే సమయంలో పాదాలు సరిగ్గి భూమిపై ఆనేలా ఓ ఆకృతి డెవలప్ అవుతుంది. ఎక్కువ సేపు రన్నింగ్ చేసినా ఎలాంటి ఒత్తిడి కాళ్లపై పడదు.

క్రీడల్లో పాల్గొనేవారు సైతం ఇలాంటి చిట్కాను పాటించవచ్చు. అయితే కాలి వ్రేళ్లకు టేపు వేసినప్పుడు దురద గానీ.. లేక రాష్ గా అయితే మాత్రం వైద్యులను సంప్రదించండి. మరో విషయమేంటంటే రిజిడ్ స్పోర్ట్స్ టేప్ మెడికల్ షాపులో అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఎక్కువగా ఖర్చు పెట్టకుండా కాళ్ల నొప్పుల బాధ నుంచి ఈ చిట్కా పాటించి పెయిన్ తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Comment