షుగర్ పేషంట్స్ కు ఈ దుంపలు ఎంత మేలో చేస్తాయో తెలిస్తే అస్సలు వదలరు..

manaarogyam

శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగితే కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడవలసి వస్తుంది.. ముఖ్యంగా ఆహార నియమాలను పూర్తిగా మార్చుకోవల్సిన పరిస్థితి.. ఇకపోతే చలికాలంలో చామ దుంపలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయట..ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఇ సమృద్ధిగా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రించగలదని, గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందని పరిశోధనలో తేలింది.

వీటి దుంప పిండి పదార్ధమైన కూరగాయ అయినప్పటికీ, ఇది రక్తంలో చక్కెర నియంత్రణ చేసే రెండు రకాల కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. భోజనం తర్వాత షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.అందుకే వీటికి డిమాండ్ కూడా పెరిగింది. ఒక్కో రాష్ట్రం లో ఒక్కో పేరుతో వీటిని పిలుస్తారు. వెరైటీ వంటలను కూడా వండుతారు. ముఖ్యంగా అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.. ఇక ఆలస్యం చేయకుండా వీటిని మీ ఆహారంలో చేర్చుకొండి..

Leave a Comment