బ్రౌన్ రైస్ లడ్డు ను చేసుకోండిలా..

manaarogyam

బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది..ఈ రైస్ తో వివిధ రకాల వంటలను చేసుకొని తింటారు. అందులో ఒకటి బ్రౌన్ రైస్ లడ్డు..ఎన్నో పొషకాలు ఉన్న ఈ లడ్డు ను కావలసిన పదార్థాలు, ఎలా తయారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసినవి..

బ్రౌన్ రైస్
కొబ్బరి తురుము
500 గ్రాములు బెల్లం
50 మిల్లీలీటర్లు నెయ్యి
1 స్పూన్ యాలుకల పొడి
కొన్ని జీడిపప్పు పలుకులు

తయారి విధానం..

ముందుగా బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టి,ఒక గుడ్డ పై ఆరబొయాలి..రెండు గంటలపాటు ఆరబెట్టడం మర్చిపోకండి. పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే లడ్డూలు తయారు చేసుకోవాలి.స్టవ్ మీద పాన్ పెట్టి బియ్యం వేసి కాస్త రంగు మారేవరకు వేయించుకోండి.ఆ బియ్యాన్ని మెత్తని పొడి లాగా చేసుకోవాలి.బెల్లం లో నీళ్ళు వేసి మరిగించండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని కొబ్బరి తురుములో వేసి అందులో జీడిపప్పు, నెయ్యి, బియ్యం పిండి, యాలుకల పొడి వేసి బాగా మిక్స్ చేయండి.. లడ్డు లా వచ్చే వరకూ వుంచి లడ్డు లను చేసి గాలి లేని డబ్బా లలో వుంచితే ఎక్కువ కాలం ఉంటాయి.. మీకు ఈ రెసిపి నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

Leave a Comment