ఎటువంటి నొప్పి అయిన భరించవచ్చు. ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. కానీ పంటి నొప్పి ఒకసారి వస్తే మాత్రం జీవితాంతం బాధ పడాల్సిందే.. ఎన్ని మందులను వాడినా కూడా కొంతవరకూ మాత్రమే ఉపశమనం కలుగుతుంది. మళ్ళీ మొదటికి వస్తుంది.దంతాలు పుచ్చిపోవడం, ఇన్ఫెక్షన్, కొత్త దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వ్యాధులు వాటి వల్ల ఈ నొప్పి వస్తుంది.
ఇలాంటి వాటికి వంటింటి చిట్కాలు బెటర్.కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే ఈ పంటినొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూద్దాం..
లవంగాల్లో ఉండే యుగేనల్ అనే రసాయన పదార్థం తేలికపాటి మత్తును కలిగిస్తుంది. నొప్పి వచ్చే దంతం దగ్గర లవంగాన్ని ఉంచి నెమ్మదిగా నములుతూ ఉంటే అందులోని నూనె విడుదలై నొప్పి తగ్గిపోతుంది.
గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి ఆ నీటితో పళ్ళు పుక్కిలిం చాలి.. ఇలా చేసిన ఉపశమనం కలుగుతుంది.వెల్లుల్లిలో అధికంగా ఉండే యాంటి బయోటిక్ గుణాలు తీవ్రమైన పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మిరియాల పొడిని పంటి మీద వుంచి నీళ్ళు వచ్చే వరకూ ఉంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది..