తాటిబెల్లం ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరం..

manaarogyam

సాదారణంగా చక్కెరకు బదులుగా, బెల్లం తినడం మేలు అని నిపుణులు అంటున్నారు.. షుగర్ వంటి వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది.మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో తాటి బెల్లం కూడా మంచిదే..

తాటిబెల్లం ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరం.. ఆయుర్వేదం లో తాటి బెల్లం వాడకం గురించి ప్రత్యేకంగా వివరిస్తుండటంతో కొందరు తాటిబెల్లం వినియోగం వైపు మొగ్గుచూపుతున్నారు. రోగనిరోధక శక్తి పెంచి, రసాయన రహితమైన ఆర్గానిక్ గా తయారు చేస్తారు.. న్యాచురల్ గా తయారు చేసే ఈ బెల్లం లో ఎన్నో పొషకాలు దాగి ఉన్నాయి.

ఈ బెల్లం తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్యం వుందో ఇప్పుడు తెలుసుకుందాం..

అధిక మొత్తంలో విటమిన్స్, మినరల్స్ తాటిబెల్లంలో ఉంటాయి. ఇది త్వరగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం నుంచి చక్కగా బయట పడవచ్చు. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

అంతేకాదు ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చట. తాటి బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో దెబ్బతిన్న కణాల పునరుత్పత్తి జరుగుతుంది.క్యాన్సర్ వంటి వ్యాధులను దరి చెరనివ్వకుండా చేస్తుంది.రక్తంలో హెమొగ్లొబిన్ ను పెంచుతుంది.. గుండె ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు తాటి బెల్లం సహాయపడుతుంది.. చూసారుగా ఎన్ని ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయో.. మీకు వీలైనప్పుడు ఈ బెల్లం ను తీసుకోండి..

Leave a Comment