తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయొజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చలికాలంలో ఎక్కువ గా వచ్చే సీజనల్ వ్యాధులను నయం చేయడం లో సహాయపడతాయి.ఇకపోతే తులసి ఆకులు మాత్రమే కాదు గింజలు కూడా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.తులసి గింజల తో ఎటువంటి ప్రయొజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తులసి గింజల్లో ప్రోటీన్స్ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి చక్కగా పనిచేస్తాయి. తులసి గింజలు అనేక రోగాల నివారణకు పనిచేస్తుంది.తులసి గింజలను ఉదయాన్నే ఖాళీ కడుపున తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. ప్రేగుల్లో పేరుకుపోయిన మలం తేలికపడి మల విసర్జన సాఫీగా జరుగుతుంది.

అంతేకాదు మలబద్దకం సమస్యలు తగ్గించడంతో పాటుగా మరెన్నో సమస్యలు దూరం అవుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచడానికి తులసి చక్కగా పనిచేస్తుంది..బరువును కంట్రోల్ లో ఉంచుతుంది.తులసి రసంలో కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగితే కడుపు నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. కడుపులో నులిపురుగులు కూడా చనిపోతాయి. ముఖ్యంగా నోటి సమస్యలు తగ్గిపోతాయి..