ఈ పండ్లను అస్సలు కలిపి తినకండి..ఎందుకంటే?

manaarogyam

పండ్లను తినేటప్పుడు అన్నీ కలిపి లేదా రెండు పండ్ల ను ఒకేసారి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకు తినకూడదు? తింటే ఎమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

అలా తీసుకోవటం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి పండు,నిమ్మ కలిపి అసలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే రక్తంపై ప్రభావం చూపుతుంది. దాంతో హిమోగ్లోబిన్ స్థాయిలలో హెచ్చు తగ్గులు వచ్చి రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆరెంజ్, క్యారెట్ కలిపి తీసుకుంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గుండెల్లో మంట కూడా వచ్చే అవకాశం ఉంది..గ్యాస్ సమస్యలు బాధించవచ్చును. రెండు తింటే ఉదర సమస్యలు కూడా పెరుగుతాయని అంటున్నారు.

జామ ను తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.అరటి పండును తీసుకోవటం మంచిది. అయితే ఈ రెండింటిని కలిపి అస్సలు తీసుకోకూడదట.కలిపి తింటే గ్యాస్ సమస్య,తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానిమ్మ పండు, నేరేడు పండు కలిపి తింటే సరిగా జీర్ణం కాక జీర్ణ సంబంద సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి తినకండి..

Leave a Comment