నడుము కింద కొవ్వు కరగాలంటే ఇలా చేసి చూడండి..

manaarogyam

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు తో బాధపడుతున్నారు. నడుం,పిరుదల దగ్గర కొవ్వు పేరుకుపోతుంది..అది తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.వెంటనే ఫలితం అనేది కనిపించదు.అలాంటప్పుడు స్క్వాట్స్‌ వ్యాయామం చేస్తె ఆశ్చర్యపోయే ఫలితాలను పొందొచ్చు. అదేలానొ వివరంగా తెలుసుకుందాం..చేయడానికి కాస్త కష్టం అనిపించిన కూడా అలవాటు చేసుకుంటే ఈ వ్యాయామం తేలికగానే అనిపిస్తుంది.

ఈ వ్యాయామం ఎలా చేయాలంటే.. ముందుగా నిటారుగా నిలబడాలి.మోకాళ్లను వంచి కిందకి కుంగాలి. ఇలా కుంగినప్పుడు నడుం పైభాగాన్ని ముందుకు వంచి, చేతులు రెండూ మడిచి, వేళ్లను కలపాలి.కుంగి లేచేటప్పుడు మోకాళ్లు, పాదాలు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే నడుం పై సరైన ఒత్తిడి పడుతుంది.వంగినప్పుడు ఊపిరి పీల్చుకుని, లేచి నిలబడ్డప్పుడు వదలాలి.ఇలా ప్రతి రోజు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30 స్క్వాట్స్‌ చేస్తే పిరుదుల్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది.చుసారుగా ఎటువంటి ఖర్చు లేకుండా మంచి ఫలితాలను పొందే ఈ వ్యాయామం మీరు చేయండి..

Leave a Comment