ఎత్తు చెప్పులు వాడే మహిళలు ఇవి గుర్తుంచుకోవాలి..

manaarogyam

ట్రెండ్ కు తగ్గట్లు మహిళల చెప్పుల సైజ్ ను కూడా పెరిగింది.వారి ఇంట్రెస్ట్ ను బట్టి ఆయా తయారీ కంపెనీలు కూడా కొత్త రకం మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో వివిధ రకాల హై హిల్స్, పెన్సిల్ హిల్స్ వంటి చెప్పులు వచ్చాయి. ఇవి చూడటానికి బాగానే ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.. ఎప్పుడో ఒకసారి వేసుకోవడం ఉత్తమం.. మరి రోజూ వేసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

ఇక పోతే..హై హిల్స్ చెప్పులను ఎక్కువసేపు వేసుకుంటే మడమల నొప్పులు వస్తాయి. ఎత్తయిన చెప్పులను ఎక్కువసేపు వేసుకొని నడవడం, నిలబడ్డం చేయడంతో కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కొన్ని ఎత్తైన చెప్పుల కారణంగా మునివేళ్ల మీద అధిక ఒత్తిడి పడడంతో బొటనవేలు వంకర పోవడం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ళ మడమలు అరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయి..ఎత్తు కనిపించాలంటే సరైన చెప్పులు వేసుకుంటే సరిపోతుంది.సాక్సులను ధరించి చెప్పులు వేసుకోవడం మంచిది..ఇలా చేయడం వల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి..

Leave a Comment