తొందరగా కొవ్వు కరగాలంటే ఈ ఆసనాలు వెయ్యాల్సిందే?

manaarogyam

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బరువు తగ్గించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం అమ్మాయిలు జీరో సైజు, అబ్బాయిలు సిక్స్ ఫ్యాక్ కోసం కష్టపడుతున్నారు.అది కూడా ఈజిగా ఉండేలా చూస్తున్నారు.యోగా లతో ట్రై చేస్తున్నారు. అందుకే వీటికి డిమాండ్ కూడా పెరిగిపొయింది.కాస్త కష్టంగా ఉన్న ఈ యోగా చెయ్యడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..

కుర్చీ ఆసనం:

ఈ ఆసనం పేరులోనే అర్థం ఉంది.. కుర్చీ ఆకారంలో కుర్చొని అరచేతులను ఎదురుగా వచ్చేలా చేసి కూర్చోవాలి.15 నుంచి 20 సెకన్ల పాటు ఇలా కూర్చోవడం వల్ల తొడల దగ్గర ఉన్న కొవ్వు కరిగిపోయి బాడీ మంచి ఆకృతిలో కి వస్తుంది.

ట్రైయాంగిల్:

ట్రై యాంగిల్ ఆసనం వేస్తున్న సమయంలో మీ కాళ్లను వెడల్సుగా, చేతులను నేలకి సమాంతరంగా ఉంచాలి. ఎడమవైపునకు వంగి నేలను వీలూనంత వరకు తాకగానికి ప్రయత్నించాలి. ఈ స్థితిలో 10-15 సెకన్లు ఉండాలి. ఈ యోగాతో జీర్ణశయాంతర పనితీరును ప్రోత్సహిస్తుంది. బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడాన్ని ఈ ఆసనం తగ్గిస్తుంది. భుజం, కాలు, చేతి కండరాలకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ఆసనం కొత్త కండరాల ఏర్పాటు కు దోహదపడుతుంది..

ఈ రెండు ఆసనాలు ముఖ్య ఆసనాలు.. వీటితో పాటుగా బోట్,విరప్రదాసనం వంటి ఆసనాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి..

Leave a Comment