Eye Twitch:భారతదేశంలో అనేక సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నాయి. అయితే వీటిని పాటించాలని పూర్వకాలంలో పెద్దలు మూఢ నమ్మకాల రూపంలో చెప్పేవారు. పెద్దలు చెప్పిన వాటిలో కొన్ని శాస్త్రీయంగా నిరూపితం అయినా.. మరికొన్నిమాత్రం మాత్రం నిరూపితం కాలేదు. మనకు వాస్తు శాస్త్రం లాగే.. శకున శాస్త్రం కూడా ఉంది. దాని ప్రకారంగా మన శరీరంలో కొన్ని అవయవాలు కదిలితే కీడని, మరికొన్ని కదిలితే మంచివని అంటుంటారు. ముఖ్యంగా ఆడవారికి ఎడమకన్ను, మొగవారికి కుడికన్ను కదిలితే మంచిదంటారు. ఇవి ఎక్కువగా గ్రామాల్లో వినిపిస్తుంటాయి. అయితే కన్ను కదిలితే నిజంగానే కీడు జరుగుతుందా..? రామాయణంలో దీనికి సంబంధించిన కథ ఏది..?

గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ కొన్ని మూఢనమ్మకాలు ఇప్పటికీ నమ్ముతుంటారు. అయితే అన్నింటికి కొట్టిపారేయలేం. కొన్ని మన అవసరాలకు అనుగుణంగా పెద్దలు శాస్త్రీయంగా నిరూపించారు. ఉదాహరణకు ఇంటి ముందు కల్లాపి చల్లాలని లేకుంటే లక్ష్మీ రాదని చెప్పారు. అయితే అలా చేయడం వల్ల ఇల్లు పరిశుభ్రంగా మారుతుందని అర్థం. కానీ కొన్ని మాత్రం శాస్త్రీయంగా నిరూపితం కాకుండా మూఢనమ్మకాలుగానే మిగిలిపోయాయి. ఉదాహరణకు ఎవరైనా తుమ్మితే బయట ప్రమాదం జరుగుతుందని చెబుతూ ఉంటారు. అందువల్ల కాసేపు ఆగి నీళ్లు తాగాలని అంటూంటారు. కానీ పరీక్షకు వెళ్లే విద్యార్థి అలా ఆలోచిస్తే సమయం గడిచిపోతుంది.
వీటిలాగే చాలా మంది మొగవారికి కుడికన్ను కదిలితే మంచిదంటారు.. ఆడవారికి ఎడమకన్ను కదిలితే మంచిదంటారు. అయితే దీని వెనుక రామయణంలో ఓ స్టోరీ ఉందని అంటున్నారు. లంకపై రాముడు దాడికి వచ్చే ముందు రావణాసురుడికి, సీతకు ఒకేసారి ఎడమకన్ను అదిలిందట. ఆ తరువాత రావణాసురుడికి కీడు, సీతకు మంచి జరిగిందని అంటారు. అయితే ఆ విషయాన్ని కథలా తీసుకుంటే శాస్త్రీయంగా మాత్రం నిరూపితం కాలేదని వైద్యులు చెబుతున్నారు.
ఎందుకంటే కన్ను అదలడం అనేది శరీరంలోని వీక్ నెస్ ను సూచిస్తుందని అంటున్నారు. నరాల వీక్ నెస్ ఉన్నవాళ్లలో ఒక వైపు అవయవాలు అప్పుడప్పుడు అదులుతూ ఉంటాయట. ఇందులో భాగంగానే కన్ను కూడా కదులుతుందట. అయితే కంట్లో సమస్యలు ఉన్నా.. ఇలా అప్పుడప్పుడుూ కదులుతూ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల కన్ను అదే పనిగా అదిలినట్లయితే వెంటనే వైద్యలను సంప్రదించండి.. అంతేగానీ.. ఏదో మంచి జరుగుతుందని, చెడు జరుగుతుందని ఆలోచించవద్దని వైద్యులు సూచిస్తున్నారు.