ఇలాంటి గులాబ్ జామ్ ఒకసారైన తినాలి సుమీ..

manaarogyam

గులాబ్ జామ్.. ఆ పేరు లో ఎదో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి. అందుకే పేరు వినగానే నోట్లో నీళ్ళు ఊరతాయి.అయితే ఇంట్లో దొరికే గోధుమ పిండి తో త్వరగా ఎలా తయారు చెసుకుంటారు అనేది ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి: ఒక కప్పు
పాల పొడి: రెండు స్పూన్లు
నెయ్యి : మూడు స్పూన్లు
పాలు: కొద్దిగా
చక్కెర: అరకప్పు
యాలుకల పొడి: అర స్పూన్
నూనె: డీ ఫ్రై కోసం

తయారి విధానం:

ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసి ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి మంచి వాసన వచ్చేంతవరకు మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆ గోధుమ పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి.పాల పొడి, బేకింగ్ సోడా,నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.. అందులో కాచి చల్లార్చిన పాలను వేసి చపాతీ పిండిలా చేసుకోవాలి.ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు చక్కర,కప్పు నీళ్ళు పోసి బాగా కరగనివ్వాలి.చక్కెర పాకం తయారు అవుతున్నప్పుడు అందులో యాలకుల పొడి వేసుకోవాలి. పాకం తయారు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు జామూన్ లను చేసి నూనె లో ఫ్రై చేసి పాకంలో వేయాలి.అలా ఒక గంట నానబెట్టాలి..ఇంతే ఎంతో రుచికరమైన జామూన్ రెడీ..

Leave a Comment