ఈ నాలుగు చిట్కాలతో తెల్ల జుట్టుకు గుడ్ బై చెప్పండి..

manaarogyam

మారుతున్న కాలం, ఆహారపు అలవాట్లు జుట్టు రాలి పోవడానికి, తెల్ల జుట్టు రావడానికి కారణం కావచ్చు. బయట దొరికే జంక్ ఫుడ్స్ కాకుండా ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి.ఆకు కూరలు, పెరుగు, తాజా పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇది కాకుండా మీరు కొన్ని చిన్న చిట్కాల ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ నాలుగు చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

మందారం పేస్ట్:

మందారం జుట్టుకు మంచి మెడిసిన్.. నాలుగు మందార పువ్వు రేకులను తీసుకోని బాగా మరిగించాలి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ పేస్ట్ ను తలకు పట్టించి ఆరాక చల్ల నీళ్ళతో స్నానం చేస్తె మంచి నిగారింపు వస్తుంది.

కాఫీ:

రుబ్బిన కాఫీని తీసుకుని అందులో నీళ్ళు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని మీ జుట్టుకు పట్టించి ఒక గంట లేదా రెండు గంటల పాటు ఉంచి స్నానం చేస్తె సరి.. తెల్లని జుట్టు మాయం అవుతుంది.

హెన్నా:

గోరింటాకు పొడిని వేడి నీటిలో వేసి బాగా కలపాలి. మీ జుట్టు పొడిగా ఉంటే మీరు పెరుగును కూడా జోడించవచ్చు. చేతులకు గ్లౌజ్‌ల ధరించండి. మీ జుట్టుకు పేస్ట్‌ను అప్లై చేయండి. ముదురు రంగు కోసం 2-3 గంటల పాటు అలాగే ఉంచండి..తెల్లని జుట్టును నల్లగా మార్చడం లో మంచి మెడిసిన్.

మెంతులు:

మెంతులను రెండు మూడు గంటల పాటు నాన బెట్టాలి.ఇప్పుడు గింజలను వేరు చేసి, అందులో ఒక చెక్క నిమ్మరసం కలపాలి.అన్ని పదార్థాలను పేస్ట్ చేసి, ఆపై ప్యాక్ రూపంలో అప్లై చేయవచ్చు. ఈ హెర్బల్ హెయిర్ ప్యాక్ మీ తెల్ల జుట్టు అందంగా ఉండటమే కాకుండా ఒత్తుగా పెరిగెలా చేస్తుంది.

Leave a Comment