ఈ ఒక్క మాట మీ దాంపత్య జీవితాన్ని మార్చేస్తుంది..!

manaarogyam

భార్య భర్తలు అన్యొన్యంగా ఉండాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకంతో పాటుగా అవగాహన ఉండాలి.. అప్పుడే మ్యారేజ్ లైఫ్ సాఫిగా సాగిపోతుంది.కొన్ని పదాలను అనకూడదు.. వాటి వల్ల బంధం తెగిపోతుంది.ఇక పెళ్లి చేసుకున్న వారు సైతం.. తాము నరకంలో ఉన్నామని ఫీలౌతూ ఉంటారు. అయితే… దంపతుల మధ్య తరచుగా వచ్చే గొడవలు, వాదనలు, వాదించుకోవడం ఇలాంటివి జరగడం వల్ల.. దంపతులు మ్యారేజ్ మీద ఇలాంటి ఓపీనియన్ తెచ్చుకునే అవకాశం ఉంటుందట. కొన్ని రకాల అపార్థాలు, ఉపయోగించే పదాలు బంధాన్ని తెంచుకోడానికి దారి తీస్తాయి.ఆ మాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

రిలేషన్ లో ఉన్నప్పుడు, జంటలు తమ సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టరు, కానీ వారి సొంత ఇగో ని తృప్తి పరచడం పై దృష్టి పెడతారు. జంటలు తమ తప్పులకు ఒకరినొకరు త్వరగా నిందించుకుంటారు, ఇది సంబంధంలో ఎక్కువగా విడిపోవడానికి కారణమౌతుంది..అందుకే ఎక్కడ సమస్య మొదలైందొ చూసి దాని పరిష్కారాన్ని వెతికితే చాలా మంచిది.

అలాంటి కొన్ని సందర్భాలలో సారీ చెప్పినా కూడా మన భాగస్వామి కరగదు..అది కూడా నిరాశను కలిగిస్తుంది..మీకు , మీ భాగస్వామికి మధ్య ఎల్లప్పుడూ సమతుల్యత ఉండాలి. నిందను మార్చడం వల్ల మీకు ప్రయోజనం ఉండదు, కానీ మీ అహాన్ని మాత్రమే పెంచుతుంది. కానీ, మీ తప్పులకు జవాబుదారీగా ఉండటం మిమ్మల్ని మంచి వ్యక్తిగా చేస్తుంది..అందుకే ఇద్దరి మధ్య ఎం జరిగినా కూడా సర్ది చెప్పుకొనేలా వుండాలి. అప్పుడే దాంపత్య జీవితం హాయిగా ఉంటుంది..

Leave a Comment