సాదారణంగా భార్యాభర్తల సంబంధం మరింత బలంగా మారాలంటే వారికి ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి.నమ్మకం లేని బంధం ఎక్కువ రోజులు నిలువదు.భార్యభర్తల మధ్య బంధం ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వారి బంధంలో ఎలాంటి మనస్పర్థలు రాకుండా ఉండాలని.. సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. అది అందరికీ సాధ్యం కాదు. ఎంత మంచిగా ఉందామని ప్రయత్నించినా.. ఏవోక గొడవలు వస్తూనే ఉంటాయి.

వారిద్దరికీ కొన్ని రకాల లక్షణాలు ఉండటం,కొన్ని ఆలోచనలు చేయడం వల్ల బంధం కొద్ది రోజులకే తునకలు అవుతుంది.ఎటువంటి వాటి వల్ల బంధం బ్రేక్ అవుతుంది.అసలు నిపుణులు ఎం చెబుతున్నారు..ఒకసారి చూసేద్దాం..మంచి చెప్పినప్పుడు భార్య చెప్పిన విషయాన్ని భర్త వినడం ఉత్తమం. అలా వినడం వల్ల.. వారికి కూడా మీరు గౌరవం ఇచ్చిన వారు అవుతారు. దీంతో.. మీ బంధం ఆనందంగా సాగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

అబద్దాలు చెప్పే అలవాటు చాలా మందికి ఉంటుంది. అవసరానికి ఓ అబద్దం చెప్పడం చాలా సహజం. అయితే.. కొందరు అదే పనిగా పెట్టుకొని.. మాట్లాడితే అబద్ధాలు చెబుతూ ఉంటారు. నిజాలు దాచిపెడుతూ ఉంటారు. అబద్ధాలతో బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటూ ఉంటారు..అలాంటి అబద్దాల వల్ల కాపురం కలకాలం ఉండదు..ఒకరి ఇష్టాలను మరొకరు అర్థం చేసుకోవాలి… అప్పుడే సంసారం అనే పడవ సాఫిగా సాగుథుంది.