చలికాలంలో గోంగూరను తింటే ఆ సమస్యలు వస్తాయా?

manaarogyam

చలికాలం వచ్చింది అంటే ఎన్నో రోగాలు కూడా వస్తాయి. దగ్గు, జలుబు,వైరల్ జ్వరాలు వంటి సమస్యలు అత్యధికంగా ఉంటాయి. జనవరి నెల అంటే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.ఆరోగ్యంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇక ఈ వింటర్ సీజన్‌లో శరీరానికి వేడిని అందించే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి ఆహారాల్లో గోంగూర ఒకటి. ఆకుకూరల్లో ఒకటైన గోంగూరుతో మన భారతీయులు ఎన్నో రకాల వంటలు చేస్తుంటారు.

గోంగూర పచ్చడి, గోంగూర చికెన్‌, గోంగూర మటన్‌, గోంగూర పప్పు ఇలా ఎన్నో రుచికరమైన వంటలు చేస్తారు.గోంగూరను తీసుకోవడం వల్ల రుచి మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. చలికాలంలో గోంగూరను తీసుకోవడం వల్ల బాడీలో చలి తగ్గి వేడిని పుట్టిస్తోంది.గోంగూరను తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. గోంగూర తీసుకోవడం వల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది.గుండె జబ్బుల బారిన పడే అవకాశం కూడా తక్కువ..

Leave a Comment