చలికాలంలో ఏది తాగాలన్న, తినాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలొచించాలి. ఎందుకంటే అవి ఒకవేళ పడకపోతే మాత్రం జలుబు చేస్తుంది. అంతేకాదు గొంతు సంబంధిత వ్యాధులు కూడా ప్రభలే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యకరమైన డిటాక్స్ పానీయాలను తీసుకుంటే రోగనిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. దాని కోసం శ్రమ కూడా అవసరం లేదు. ఇంట్లో దొరికే వాటితోనే తయారు చేసుకోవచ్చు. అవెంటో ఒకసారి చూద్దాం..
ఆపిల్ గురించి ప్రత్యెకంగా చెప్పనక్కర్లేదు. చలికాలంలో ఆపిల్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. ఆ పానీయం తయారి కోసం 1 ఆపిల్‌ను చిన్న ముక్కలుగా కట్ చేయాలి.. 3 ఖర్జూరాలు, 3 బాదంపప్పులను పాలలో కలపాలి. 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన చియా గింజలను అందులో జోడించండి.. ఈ పానీయం లో అనేక రకాల విటమిన్లు ఉన్నాయి.
ఇమ్మ్యునిటి పెంచడం లో అల్లం భేష్.. ఈ అల్లం, బీట్ రూట్ తో కలిపి టీ చేసుకొని తాగితే చాలా మంచిది..ఈ టీ చేయడానికి, అల్లం ఒకటి తీసుకోవాలి. అలాగే అరకప్పు నీరు.. దీంతో పాటు తురిమిన బీట్ రూట్ ఒకటి.. తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరిగించి అందులో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఉప్పు వేసి, కొద్దిగా ఎండు మిర్చి కూడా వేసుకుంటే మరింత రుచి పెరుగుతుంది. అలెర్జీలు, జలుబు, దగ్గు, జ్వరాలకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడం లో సహాయపడుతుంది.
ఇవే కాదు తేనే, నిమ్మరసం,ఉసిరి రసం,తులసి అల్లం టీ కూడా మంచి మెడిసిన్.. ఈ పానియాలను చలికాలంలో తీసుకోవడం వల్ల రోగ నిరోదక శక్తీ పెరుగుతుంది.