చలికాలంలో ఎక్కువగా ఆకలి ఎందుకు వేస్తుందో తెలుసా?

manaarogyam

చలికాలంలో ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా వెంటనే జీర్ణమవుతుంది. వేసవి కాలంలో మాత్రం అస్సలు ఏదైనా తినాలన్నా కూడా తినాలని అనిపించదు.చలికాలంలో ఎందుకు ఎక్కువ ఆకలి వేస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

చలికాలంలో టెంపరేచర్ బాగా తక్కువ ఉండడం వల్ల మన ఒళ్ళు వేడిగా మారడానికి ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది. ఎనర్జీని సప్లై చేయడానికి మెటబాలిక్ రేటు పెరుగుతుంది. దీంతో ఆకలి బాగా పెరుగుతుంది. అందుకనే ఎక్కువ ఆహారం తీసుకుంటాము. దీంతో బరువు కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే బాగా బరువు పెరిగి పోతే మళ్ళీ అనేక ఇబ్బందులను ఎదుర్క్కొవాల్సి వస్తుంది.. ఇలాంటి సమయంలో ఎటువంటి జాగ్రత్రలు తీసుకోవాలి అనేది చూద్దాం..

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా ఉంటుంది. పైగా ఫైబర్ లో తక్కువ కేలరీలు ఉంటాయి. రాగి, ఓట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోండి.. అలాగే సీజనల్ పండ్ల ను డైట్ లో చెర్చుకొండి..అప్పుడు ఆకలి తీరుతుంది.. బరువు కంట్రోల్ లో ఉంటుంది.. ఇకపోతే గొంతు సమస్యలు రాకుండా ఉండాలంటే వేడి నీళ్ళను ఎక్కువగా తీసుకొవాలి.చలికాలంలో ఎక్కువగా జ్యూస్ , సూప్ లు, సలాడ్ లను తీసుకోవడం మంచిది..అన్నీ సమస్యల నుంచి బయట పడవచ్చు.

Leave a Comment