స్త్రీలకు కూడా కోరికలు పెంచే మాత్రలు ఉన్నాయా?

manaarogyam

చాలా మంది మగవాళ్ళు కోరికలు పెరగడానికి వయగ్రా వంటి మాత్రలను వాడుతుంటారు.ఇది కేవలం పురుషుల కోసం తయారు చేశారు..కానీ స్త్రీలకు కూడా అటువంటి మాత్రలు ఉన్నాయా? అనే సందెహాలు రావడం జరుగుతుంది.. అయితే నిజంగా ఇటువంటి విషయాల గురించి వైద్య నిపుణులు ఎం చెబుతున్నారో చూద్దాం..

సాధారణంగా మోనోపాజ్ దశలో మహిళలకు ఎదురయ్యే హార్మోన్ల సమస్యల కారణంగా కోరికలు తగ్గే అవకాశం ఉంటుంది. వీరిలో కోరికలు తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మోనోపాజ్ దశలో ఉన్న మహిళలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఈ హార్మోను తగ్గడంతో వారిలో లైంగిక కోరికలు తగ్గుతాయి. జననాంగాల్లో లూబ్రికేషన్, తేమ వంటివి తగ్గుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వారు శృంగారంలో పాల్గొనడానికి అసౌకర్యంగా ఉంటుంది.

అయితే ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా ఫెమెల్ వయగ్రా పేరుతో మాత్రలు ఉన్నాయి. మెదడు నుంచి సెరటోనిన్, డోపమిన్ వంటి హార్మోనులను విడుదల చేసి మహిళల్లో లైంగిక ఆసక్తిని పెంచడానికి సహాయపడతాయి.కుటుంబంలో వత్తిడి..శరీరాకృతిలో మార్పులు, వయసు పైబడిన తరువాత కలయికలో పాల్గొంటే ఏమవుతుందో అని ఫీల్ అవుతారట అందుకే కోరికలు తగ్గుతాయి..ఈ మాత్రలను వాడే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మేలు..

Leave a Comment