బీరు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయో తెలుసా..

manaarogyam

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికీ తెలుసు.. అయిన కూడా తాగకుండా ఉండలేము..మత్తు ఎక్కించె ఈ మందు లో  కొన్ని రకాలను తీసుకుంటే ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు..బీరు ను తాగడం ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని అంటున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తగిన మోతాదులో బీరును తీసుకుంటే శరీరానికి చాలా మంచిది. చాలామంది బీర్ తాగితే పొట్ట వస్తుందని భ్రమ పడుతూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తల పరిశోధనల్లో బీర్ తాగితే పొట్ట రావడం నిజం కాదని తేలింది. బీరులో ఫౌలీ ఫినాల్ అనే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. తగిన మోతాదులో బీరును తీసుకుంటే ఫౌలీ ఫినాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి..

అంతేకాదు బీరు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. బీర్లలో ఉండే ఆల్కహాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఎక్కువ చేసి మధుమేహం బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది.. లిమిట్ గా తీసుకుంటే మంచి బెనిఫిట్స్ కలుగుతాయి.. అదే ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు..

Leave a Comment